Rayachoti: విరూపాక్షమ్మ బోనాల సందర్భంగా మంత్రి ఘన విందు!

Rayachoti: బోరెడ్డిగారిపల్లిలో శ్రీ విరూపాక్షమ్మ బోనాల సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు 30 వేల మందికి పైగా జనం తరలివచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 9 Aug 2026 11:12 PM IST
Rayachoti
X

Rayachoti: విరూపాక్షమ్మ బోనాల సందర్భంగా మంత్రి ఘన విందు!

రాయచోటి: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ విరూపాక్షమ్మ బోనాల విందుకు జిల్లావ్యాప్తంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా 30 వేలకు పైబడి జనం తరలివచ్చారు.

ఇసుక వేస్తే రాలనంత జనంతో విందు ప్రాంగణం కిక్కిరిసింది. మండిపల్లి కుటుంబం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుకు ప్రజలు చూపించిన అపూర్వ స్పందనగా ఈ విందు నిలిచింది. వచ్చిన అతిధులకు ఎవరికీ ఏ లోటు రాకుండా అందరూ సంతృప్తిగా బోంచేసి వెళ్లారు. విందుకు వచ్చిన అతిధులను ప్రతి ఒక్కరినీ మంత్రితో పాటు మండిపల్లి కుటుంభ సభ్యులు ఆప్యాయంగా పలకరింస్తూ సంతృప్తిగా తినాలని కోరారు.

మండిపల్లి కుటుంభం పిలుపు మేరకు విందుకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఆదరణ, అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story