Lakkireddypalli: టీడీపీ మహానాడులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలిటికల్ హీట్!

Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి డిజిటల్ మహానాడులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 28 May 2026 9:49 PM IST
Lakkireddypalli
X

Lakkireddypalli: టీడీపీ మహానాడులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలిటికల్ హీట్!

లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరిగిన టిడిపి డిజిటల్ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి ని పురస్కరించుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి టిడిపి కార్యకర్తల కు పంచిపెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

వైయస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాలలో ఏకాగ్రీవాలు జరిగితే మీ అంతు చూస్తానని వాళ్లు పార్టీ నాయకులను అన్నాడని, వాళ్ళ అంతు చూడడం ఏమో కానీ జగన్ బెంగళూరు నుంచి వచ్చే లోపు ఇక్కడ వైసీపీ వాళ్ళ తోళ్ళు కరేస్తామని, నువ్వు వాళ్ళ అంతు చూసేలోపు ఇక్కడ వాళ్లు రచ్చ చేస్తే వాళ్ల తోళ్ళు మేము కరేస్తామంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రజల కోసం తాము పని పనిచేస్తున్నామని, ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని, ప్రజల కోసం పోరాడే ధైర్యం, శక్తి తమకు మాత్రమే ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story