Chinnamandem: పలేటమ్మకు బోనాలు సమర్పించిన మంత్రి మండిపల్లి

Chinnamandem: చిన్నమండెం మండలం కలిబండ శ్రీ పలేటమ్మ అమ్మవారికి సతీసమేతంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Aug 2026 10:09 PM IST
Chinnamandem
X

Chinnamandem: పలేటమ్మకు బోనాలు సమర్పించిన మంత్రి మండిపల్లి

చిన్నమండెం: చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలోని శ్రీ పలేటమ్మ అమ్మవారి ఆలయంలొ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించి, యాటలు నరికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు, ఆయన సతీమణి హరితమ్మ గారు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కాళిబండ గ్రామంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలని శ్రీ పలేటమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story