Chinnamandem: చిన్నమండెం వద్ద నాగా ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం!

Chinnamandem: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో నాగా ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Sept 2026 1:33 PM IST
Chinnamandem
X

Chinnamandem: చిన్నమండెం వద్ద నాగా ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం!

Chinnamandem: చిన్నమండెం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగా ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నమండెం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్వీస్ సెంటర్ నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అవసరమైన వివిధ ఆన్‌లైన్ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సర్వీస్ సెంటర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI