Rayachoty: వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి.

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. కర్ణాటక భక్తులను సత్కరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Aug 2026 12:53 PM IST
Rayachoty
X

Rayachoty: వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి.

రాయచోటి, అన్నమయ్య జిల్లా

రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఆలయ మర్యాదలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం

రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి*, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆలయానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆప్యాయంగా పలకరించి, వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసి ఆనందం వ్యక్తం చేశారు.

తదనంతరం మంత్రి గారు స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story