Rayachoty: రాయచోటి టీడీపీ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Rayachoty: రాయచోటి టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Aug 2026 10:48 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి టీడీపీ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Rayachoty: రాయచోటి ఎస్‌ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

దేశభక్తి, ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని మంత్రి గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు, పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story