Rayachoty: రాయచోటిలో రూ.92 లక్షలతో BT రోడ్డు ప్రారంభం!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలో రూ.92 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించి, బైక్ పై నాణ్యత పరిశీలించారు.
Rayachoty: రాయచోటిలో రూ.92 లక్షలతో BT రోడ్డు ప్రారంభం!
Rayachoty: RKT రోడ్డు నుంచి పాలెం వాండ్ల పల్లె వరకు 1.2 కిలోమీటర్ల మేర రూ.92 లక్షల NRGS నిధులతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.
రోడ్డు ప్రారంభించిన అనంతరం మంత్రి గారు స్వయంగా బైక్ నడుపుతూ కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, రహదారి పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాలెం వాండ్ల పల్లె గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమైన మంత్రి గారు వారి సమస్యలను, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
కొత్తగా నిర్మించిన ఈ బీటీ రోడ్డు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడం.. అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందించడం.. ఇదే మండిపల్లి మార్క్ అభివృద్ధి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు.




