Kadapa: రెండు రోజుల పాటు కడప జిల్లాలో లోకేష్ పర్యటన!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజులు పర్యటించనున్నారు. రూ. 3100 కోట్లతో నిర్మించే దాల్మియా సిమెంట్ 2వ ప్లాంట్‌కు శంఖస్థాపన చేయనున్నారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 13 July 2026 11:47 PM IST
Kadapa
X

Kadapa: రెండు రోజుల పాటు కడప జిల్లాలో లోకేష్ పర్యటన!

కడప: కూటమి ప్రభుత్వ హయాంలో కడప జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి బాట పడుతోందని TDP జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. రేపటి నుండి రెండు రోజుల పాటు విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

14 న సాయంత్రం కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని రాత్రికి మైలవరం మండలం లోని తాడిపత్రి రోడ్డులో ఉన్న కర్మలవారిపల్లె వద్ద బస చేస్తారని, 15 న ఉదయం దాల్మియా ప్లాంట్ కు శంఖస్థాపన అనంతరం ప్రొద్దుటూరు లో టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం సాయంత్రం కడప ఎయిర్పోర్ట్ నుండి అమరావతి బయలుదేరి వెళతారని భూపేష్ రెడ్డి వివరించారు.

గత 5 ఏళ్ల వైకాపా పాలనలో జిల్లా అభివృద్ధిని విస్మరించి కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక క్రెడిట్ పొందే డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైకాపా కళ్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 3100 కోట్లతో నిర్మిస్తున్న దాల్మియా రెండవ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story