Proddatur: ప్రొద్దుటూరులో మంత్రి సత్యకుమార్ బర్త్‌డే వేడుకలు.. మెగా రక్తదాన శిబిరం!
Proddatur: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో సత్యన్న సేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి, 1000 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
Proddatur: ప్రొద్దుటూరులో మంత్రి సత్యకుమార్ బర్త్‌డే వేడుకలు.. మెగా రక్తదాన శిబిరం!
ప్రొద్దటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని "సత్యన్న సేన" సంస్థ అధ్యక్షుడు సృజన్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని నామ ఎరుకలయ్య ఆశ్రమంలో మెగా రక్తదాన శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మొదటగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయుల రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ, మంత్రి సత్యకుమార్ యాదవ్ సేవా స్ఫూర్తితో సత్తన్న సేనా సంస్కృతి సేవాస్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురవుతున్న తీవ్రమైన రక్త కొరతను గమనించి, ఆసుపత్రి వర్గాల పిలుపుమేరకు 1000 యూనిట్ల రక్తాన్ని అందిస్తామని ఇచ్చిన మాటను ఈ రోజుతో నిలబెట్టుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రొద్దుటూరు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు 974 యూనిట్ల రక్తాన్ని అందించగా, నేటి శిబిరంతో 1000 యూనిట్ల లక్ష్యం విజయవంతంగా పూర్తయింది.
రక్తదానం చేసి రోగులకు ప్రాణదాతలుగా నిలిచిన 1,000 మంది దాతలకు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో అత్యవసర సమయంలో రక్తం లేక ఇబ్బంది పడే పేద రోగులకు ఈ రక్త నిల్వలు ఎంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ హరినారాయణ, సత్యన్న సేన ప్రతినిధులు సృజన్, నరేష్ కిరణ్ హరీష్ లోకేష్ రెడ్డి, ఒంటేరు భాస్కర్ రెడ్డి, గౌరీ శంకర్ చిరు, వంకదార నరేంద్ర, వెంకట్ నాయుడు, స్థానిక బిజెపి నాయకులు, సత్యకుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




