Rayachoti: రాయచోటిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Oct 2026 1:04 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Rayachoti: రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో జిన్నా కలెక్షన్ పక్క సందు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక వీధిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని అర్హులైన పింఛనుదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా పింఛనుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య గారితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, పింఛనుదారులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI