Kadapa: ప్రేమ పేరిట వంచన మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో కేసు నమోదు!

Kadapa: సోషల్ మీడియా పరిచయంతో ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం. ఖాజీపేట లాడ్జిలో ఘాతుకం. నిందితుడు ఈశ్వర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన కడప పోలీసులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 27 May 2026 9:39 AM IST
Kadapa
X

Kadapa: ప్రేమ పేరిట వంచన మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో కేసు నమోదు!

Kadapa: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘోర కలియుగ ఘటన కడప జిల్లా ఖాజీపేటలో వెలుగుచూసింది. నిందితుడైన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

దువ్వూరు మండలానికి చెందిన ఒక బాలిక ఇటీవలనే పదో తరగతి పూర్తి చేసింది. ఈ క్రమంలో వల్లూరు మండలం కోట్లూరుకు చెందిన ఈశ్వర్ అనే యువకుడితో సామాజిక మాధ్యమాల ) ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బాలికను ప్రేమిస్తున్నానంటూ సదరు యువకుడు నమ్మబలికాడు.

లాడ్జికి తీసుకెళ్లి ఘాతుకం

సోమవారం ఉదయం "నిన్ను చూడాలని ఉంది" అంటూ ఈశ్వర్ ద్విచక్ర వాహనంపై బాలిక నివాసానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆమెను ఖాజీపేటలోని ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తిరిగి ఇంటి సమీపంలో వదిలిపెట్టి పరారయ్యాడు.

ఆసుపత్రికి తరలింపు

బాధిత బాలిక తీవ్ర రక్తస్రావంతో భయపడిపోతూ, జరిగిన దారుణాన్ని తన తల్లికి వివరించింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితిని సమీక్షించిన వైద్యులు, మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story