Proddatur: ప్రొద్దుటూరులో కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు ఆదినారాయణరెడ్డి!
Proddatur: ప్రొద్దుటూరు అభివృద్ధిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు. వైఎస్సార్సీపీ తీరుపై మండిపాటు, రూ.45 కోట్ల హౌసింగ్ నిధుల రాకపై ప్రకటన.
Proddatur: ప్రొద్దుటూరులో కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు ఆదినారాయణరెడ్డి!
Proddatur: ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కొర్రపాడు రోడ్డులోని ఎస్.కె.ఎస్.సి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నేతృత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి పరుగులు పెడుతోంది. స్థానిక మున్సిపల్ ఎలక్షన్లలో గత మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి కనీసం సంతకం కూడా చేయకుండా నామినేషన్ దాఖలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల పేరుతో దోపిడీ జరిగిందని, టిడ్కో ఇళ్లను పడగొట్టి ఇనుము అమ్ముకున్నారని మండిపడ్డారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో రాచమల్లుకు ప్రమాదం ఉందని తెలిస్తే తామే ఆదుకున్నామని గుర్తుచేశారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేక నిధులు కోరారని, త్వరలోనే అన్నీ పూర్తవుతాయన్నారు. ప్రొద్దుటూరుకు రూ. 45 కోట్ల హౌసింగ్ ఫండ్స్‌తో పాటు మరిన్ని నిధులు రానున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మహిళలకు 20కి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కూటమి ప్రభుత్వం మహిళలను అన్నివిధాలా ప్రోత్సహిస్తోందని చెప్పారు. పులివెందులలోనూ కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారని తెలిపారు. జగన్, అవినాష్‌లకు కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో మళ్లీ విధ్వంసం తగదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, ఈ.వి. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




