Proddatur: ప్రొద్దుటూరులో జగనన్న ఇళ్ల భారీ కుంభకోణం!
Proddatur: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ గృహనిర్మాణ అక్రమాలపై విరుచుకుపడ్డారు.
Proddatur: ప్రొద్దుటూరులో జగనన్న ఇళ్ల భారీ కుంభకోణం!
Proddatur: గత వైసిపి హయాంలో జగనన్న ఇల్లు పేరిట వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజవర్గంలో ఇప్పటివరకు 35 వేల గృహాలు ఉంటే వైసిపి హయాంలో ఒక్క ప్రొద్దుటూరులోనే 23 వేల మందికి జగనన్న ఇంటి పట్టాలు అందజేశారని.. వీరిలో చాలామంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఒక్కో ఎకరాకు 10 లక్షల రూపాయలు చొప్పున అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లంచం తీసుకొని జగనన్న కాలనీలకు భూమి కొనుగోలులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకు తిన్నాడని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించారు. జగనన్న కాలనీలు అసలు నివాసయోగ్యమైన ప్రదేశాలలో ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియర్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో అక్రమాలు అన్యాయాలు ఎన్నో జరిగాయి.. గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసాలు నిర్మిస్తామని 63 కోట్ల బిల్లులు గత వైసిపి నాయకులు సాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 10 కోట్లకు సంబంధించిన ఐరన్ ను సామాగ్రిని అపహరించారు.
కానీ అక్కడ కేవలం 150 కుటుంబాలు కూడా లేకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాము. అదేవిధంగా ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించిన భూములు కొనుగోలులో వందల కోట్లు అవినీతి చేయడంతో ప్రజలందరూ గ్రహించారు. అదే విదంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులను ఇంటికి పరిమితం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి, రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు పాల్గొన్నారు.




