prodduturu: 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
prodduturu: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా 33వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పర్యటించారు.
prodduturu: 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలోని 33వ వార్డులో ఆర్ట్స్ కాలేజీ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక మాజీ కౌన్సిలర్ శివ జ్యోతి వారి భర్త కూతుబుద్దిన్ మరియు ఇతర నాయకులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
వార్డ్ లో ఉన్న ప్రజలతో ఇప్పటివరకు అందని పథకాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తూ సమస్యల చీకట్లను దాటుకుని, నవ్యాంధ్ర ప్రగతి కాంతుల వైపు అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలనా లోపాలు, నిర్లక్ష్యంతో రాష్ట్రం ఎంతటి అధోగతి పాలైందో మనమందరం చూశాం. కనీసం రహదారులపై పడిన చిన్న గుంతలను కూడా పూడ్చలేని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని నెట్టివేశారు.
రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. చినుకు పడితే జలమయమయ్యే గుంతలు, నిత్యం జరిగే ప్రమాదాలు, విరిగిన వాహనాలు, వాహనదారుల ఆవేదన... ఇవే గత ఐదేళ్ల సంక్షోభ పాలనకు పరాకాష్ట.. కూటమి ప్రభుత్వ రాష్ట్రాన్ని పునర్నిర్మించే సంకల్పంతో అధికారంలోకి వచ్చింది మన కూటమి ప్రభుత్వం. అధికారం చేపట్టిన వెంటనే శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచడమే కాకుండా... తక్షణ కార్యాచరణ ప్రారంభించింది.
అభివృద్ధి బాటలో వెళ్తు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మిషన్ మోడ్‌లో 'గుంతల రహిత రోడ్ల' కార్యక్రమాన్ని ప్రారంభించి, వేల కిలోమీటర్ల రహదారులను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తున్నారు. మౌలిక వసతుల పునరుద్ధరణ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరిపిస్తున్నామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు..ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




