Duvvuru: దువ్వూరులో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఆదేశాలు!
Duvvuru: మైదుకూరు మండలం దువ్వూరులో దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తక్షణ చర్యలు చేపట్టారు.
Duvvuru: దువ్వూరులో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఆదేశాలు!
Duvvuru: మండల కేంద్రమైన దువ్వూరులోని నంద్యాల రోడ్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ తక్షణ చర్యలు చేపట్టారు. స్థానిక నేతలు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
శాసనసభ్యుల ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అధికారులను కలిసి డ్రైనేజీ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మరో వారం రోజుల్లో అవసరమైన చట్టపరమైన అనుమతులన్నింటినీ పూర్తి చేసుకుంటామని తెలిపారు. అనంతరం డ్రైనేజీ స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆపై తాత్కాలిక డ్రైనేజీ నిర్మాణాన్ని వేగవంతంగా చేపడతామని వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఎల్లప్పుడూ ముందుంటారని, నంద్యాల రోడ్డు వాసుల ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని ఈ సందర్భంగా టిడిపి టౌన్ ఇంచార్జ్ పాపినేని రాంబాబు స్పష్టం చేశారు.




