Mydukur: పేదలకు అండగా సీఎం సహాయ నిధి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్!
Mydukur: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ 43 మంది లబ్ధిదారులకు రూ. 28,69,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
Mydukur: పేదలకు అండగా సీఎం సహాయ నిధి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్!
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు లో 43 మంది లబ్ధిదారులకు రూ.28,69,000 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది లబ్ధిదారులకు రూ.28,69,000 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం తక్షణ సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అలాగే ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




