Mydukur: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పుట్టా!
Mydukur: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. మార్చురీ, డయాలసిస్ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం!
Mydukur: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పుట్టా!
Mydukur: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిని మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు సందర్శించి, ఆసుపత్రిలో అవసరమైన మార్చురీ, పోస్టుమార్టం గది, ఔట్‌పోస్ట్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎమ్మెల్యే గారు స్వయంగా పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది తగిన శ్రద్ధ వహించాలని సూచనలు అందించారు.
అలాగే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొని, ఆసుపత్రి పరిసరాల్లో చెత్తను సేకరించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.




