Proddatur: ప్రొద్దుటూరులో PMAY అర్బన్-2 పత్రాల అందజేత!

Proddatur: ప్రొద్దుటూరులో 'PMAY అర్బన్-2' పథకం కింద మొదటి విడతగా 83 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అర్హత పత్రాలను అందజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 30 Sept 2026 3:07 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో PMAY అర్బన్-2 పత్రాల అందజేత!

Proddatur: ​ప్రొద్దుటూరు ‘PMAY అర్బన్-2’ పథకం కింద ప్రభుత్వం 369 గృహాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 83 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అర్హత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని పేదలందరికీ ప్రభుత్వం తరఫున గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 2.50 లక్షల ఉచిత ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అదనంగా రూ. 70 వేల సహాయాన్ని కూడా జోడించి, మొత్తంగా రూ. 2.50 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, హౌసింగ్ పిడి రాజారత్నం, ఈఈ రమణారెడ్డి, డిఈ వెంకటసుబ్బయ్య, రమేష్ బాబు, ఏఈ ఓబులేష్, వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR