Proddatur: 12 క్లస్టర్లుగా టీడీపీ మహానాడు.. శ్రేణుల్లో ఉత్సాహం!

Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో 12 క్లస్టర్లలో ఘనంగా మహానాడు వేడుకలు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 28 May 2026 6:57 PM IST
Proddatur
X

Proddatur: 12 క్లస్టర్లుగా టీడీపీ మహానాడు.. శ్రేణుల్లో ఉత్సాహం!

ప్రొద్దుటూరు: నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ గా విభజించారు. ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ను స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మహానాడు పండుగలు జరుపుకుంటున్నాం.

ప్రొద్దుటూరు 10వ క్లస్టలో నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డి, ప్రొద్దుటూర్ టిడిపి పరిశీలకులు భావన, నంద్యాల రాఘవరెడ్డి, బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రసూల్ గౌస్, శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.. నాగేంద్ర మాట్లాడుతూ మహానాడు సాధారణంగా మే 27 28 తేదీల్లో జరుగుతుంది. మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తాము.. వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story