Proddatur: రాచమల్లు, జగన్‌పై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫైర్!
Proddatur: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌లపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Proddatur: రాచమల్లు, జగన్‌పై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫైర్!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై, అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలకు రాజకీయంగా ఇక పుట్టగతులు లేవని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రొద్దుటూరు ప్రజలు రాచమల్లును పూర్తిగా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశార. జగనన్న కాలనీల పేరుతో ప్రజల సొమ్మును దారుణంగా దోచుకున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన ఆ సొమ్మును ప్రజలకే పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ప్రజలను సమీకరించి రాచమల్లు ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో గతంలో తమ వాళ్లను ఏకగ్రీవాలు చేసుకోమని ప్రోత్సహించింది రాచమల్లేనని గుర్తుచేశారు. "మా పార్టీ కౌన్సిలర్లపై చేయి వేసే ధైర్యం రాచమల్లుకు ఉందా?" అని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం లో ఒక్క టీడీపీ నాయకుడిపై చేయి వేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. జగన్ సొంత ఊరు బలుపనూరులోనే టీడీపీ విజయం సాధించిందని, ఇక వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో మనుగడ లేదని వ్యాఖ్యానించారు.
పులివెందులలో కౌన్సిలర్లకు నామినేషన్లు వేసే దిక్కులేక ఏకగ్రీవాలవుతుంటే జగన్ ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. సొంత చెల్లి కుమార్తె పెళ్లిని కూడా అడ్డుకుంటున్న నీచుడు జగన్ అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అధికారులు లంచాలు తీసుకున్నారని రాచమల్లు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
రాచమల్లు అహంకార పూరిత మాటలను, భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. 2029 ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో జీరో అవుతుంది అని తెలిపారు.




