Moodindlapalli: వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు మేలు 'పొలం పిలుస్తుంది'లో ఎంఏఓ
Moodindlapalli: మూడిండ్లపల్లిలో 'పొలం పిలుస్తుంది'. ఎల్ నినో ప్రభావంతో వరి సాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఎంఏఓ అమర్నాథరెడ్డి సూచన. జులై 31తో క్రాప్ ఇన్సూరెన్స్ ఆఖరు.
Moodindlapalli: వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు మేలు 'పొలం పిలుస్తుంది'లో ఎంఏఓ
మూడిండ్లపల్లి: పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మూడిండ్లపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉంది ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉన్నది.
కావున రైతులందరూ వరి సాగు చేయొద్దని వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుందని దాని బదులు ప్రత్యామ్నాయంగా పంటలైన మినుము కంది పెసర జొన్న తదితర పంటలు సాగు చేసుకోవాలని ప్రస్తుతం సాగుచేసిన మొక్కజొన్న పసుపు, మినుము పంటలను నీటి పొదుపుగా వాడుకొని డ్రిప్పు స్పింకులర్లు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నది డ్రిప్ స్ప్రింకలర్స్ ద్వారా నీటిని అందిస్తూ నీటిని పొదుపు చేయొచ్చని.
జులై 31 వ తారీకు వరకు పంటల బీమా చేసుకునే ఉంది వాతావరణ మరియు దిగుబడి ఆధారత పథకం కింద పంటలైన అరటి చీని వేరుశనగ పత్తి పసుపు ఉల్లి మినుము కంది జొన్న పంటలకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉందని రైతులు తప్పకుండా నమోదు చేసుకోవాలని తెలియజేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలన్నింటినీ పంట నమోదు అనగా ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు గ్రామ ఉద్యాన సహాయకురాలు జెరూస మరియు రైతులు పాల్గొన్నారు.




