Proddatur: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్ కుటుంబం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 20 Oct 2026 1:34 PM IST
Proddatur
X

Proddatur: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్ కుటుంబం!

Proddatur: దసరా ఉత్సవాల్లో రెండో మైసూర్ గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎంపీ సీఎం రమేష్ మరియు సీఎం సురేష్ నాయుడు సీఎం చరణ్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేశారు.

వారికి ఆలయ అధ్యక్షుడు భూశెట్టి రామ్మోహన్ రావ్ మరియు నిర్వాహకులు, అర్చకులు మరియు వైశ్య ప్రముఖులు ఘన స్వాగతం పలకడం జరిగింది. ​అనంతరం దంపతులు ఇద్దరూ అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్గాలని, రైతులు మరియు ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సంతోషంగా జీవించేలా చూడాలని అమ్మవారిని మనసారా ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఎంపీ దంపతులకు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ కమిటీ నిర్వాహకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR