Amalapuram: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన కోనసీమ వీరుడు!
Amalapuram: జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ బి.అప్పన్నను ఎంపీ గంటి హరీష్ మాథుర్ బాలయోగి ఘనంగా సత్కరించారు.
Amalapuram: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన కోనసీమ వీరుడు!
అమలాపురం: అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో పవర్ లిఫ్టింగ్ శిక్షణ పొంది,ఈనెల 18 తేదీ నుండి 21 తేదీ వరకు మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన మాస్టర్స్ నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో 550 కేజీల బరువు ఎత్తి జాతీయ స్థాయిలో సిల్వర్ మెడలను గెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కానిస్టేబుల్ & నేషనల్ పవర్ లిప్టర్ బి.అప్పన్న ను ఈరోజు అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ మధుర్ బాలయోగి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో హరీష్ మధుర్ బాలయోగి ప్రత్యేకంగా అప్పన్నను అభినందించారు.
అప్పన్న ఈ నేషనల్ క్రీడ విజయం మరి ఎందరికో యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని హరీష్ మధుర్ బాలయోగి ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అప్పన్నను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వర రావు,మంగిన నాని, వెలగట్ల జగదీష్,నేషనల్ వెయిట్ లిఫ్టర్ బి.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.




