Kadapa: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు!

Kadapa: వేంపల్లి, పెండ్లిమర్రి, వీరబల్లె మండలాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 29 Nov 2026 8:46 AM IST
Kadapa
X

Kadapa: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు!

Kadapa: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కామెంట్స్. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు. వేంపల్లి, పెండ్లిమర్రి, వీరబల్లె మండలాల్లో ఎన్నికల నిర్వహణ తీరుపై అభ్యంతరం. వేంపల్లిలో తెల్లవారుజామున 4 గంటల నుంచే పోలింగ్ ఏజెంట్లు బూతులకు చేరుకున్నారని వెల్లడి.

5.30 గంటల ప్రాంతంలో టీడీపీ నాయకులు, పోలీసులు కలిసి తమ ఏజెంట్లను బయటకు పంపించారు. బయట మండలాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పోలీసులే ఎస్కార్ట్ చేశారని విమర్శ. పోలింగ్ బూతుల వద్ద ఓటర్ల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కుంటున్నారు.

స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను వెనక్కి పంపిస్తున్నారని వ్యాఖ్య. 29,500 మంది ఓటర్లు ఉన్న వేంపల్లిలో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని ఆవేదన. ఎన్నికల కమిషన్ విధులు పోలీసు వ్యవస్థ చేతుల్లోకి వెళ్లాయా? అని ప్రశ్న.

ఎస్ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వోలు స్పందించాలని డిమాండ్. పులివెందుల మున్సిపాలిటీలో జరిగినట్లు దొంగ ఓట్ల ప్రక్రియకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. పెండ్లిమర్రి, వీరబల్లె మండలాల్లోనూ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆరోపణ.

బుజ్జిరెడ్డిపల్లె, అల్లిరెడ్డిపల్లె, చౌటుపల్లెల్లో లా అండ్ ఆర్డర్ సమస్యలపై ప్రస్తావన. ఇప్పటికే జిల్లా ఎస్పీ దృష్టికి ఎన్నికల అక్రమాల అంశాన్ని తీసుకెళ్లామని వెల్లడి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA