Rayachoti: రాయచోటిలో ఎమ్మార్పీఎస్ సమావేశం: సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మార్పీఎస్ జాతీయ నేత ఎస్. రామాంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Aug 2026 11:51 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఎమ్మార్పీఎస్ సమావేశం: సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి తాసిల్దార్ ఆఫీస్ పక్కన అంబేద్కర్ విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు అధ్యక్షతన కార్యకర్తలసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారినికోరారు.

భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అమలుకు ఆయా రాష్ట్రాలకు అధికారమిచ్చిన తీర్పు ప్రకారం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రక్క రాష్ట్రమైన తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్దత కల్పించి అన్ని రంగాలలో 59 ఉపకులాలకు అవకాశాలు కల్పిస్తున్న విషయం విధితమే అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు.

సీఎంచంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కు ఆర్డినెన్స్ ద్వారా ఐదు సంవత్సరాలు అమలుపరిచి ఎస్సీలలోని 59 ఉపకులాలకు న్యాయం చేశారు. తదుపరి సుప్రీంకోర్టు రద్దు చేయడం తిరిగి మళ్లీ ఆయా రాష్ట్రాలకు అదికారాన్ని కల్పించడం జరిగిందన్నారు.

మొదటినుంచి ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్డినెన్స్ కు బదులుగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి ఎస్సి లలో ని 59ఉపకులాలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాలలో సమన్యాయం కల్పించాలని వారురాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story