Amalapuram: ముద్రగడ ఆశయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా సాధిస్తాం

Amalapuram: అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా జరిగింది.

SURESH, AMALAPURAM
Published on: 26 July 2026 9:19 PM IST
Amalapuram
X

Amalapuram: ముద్రగడ ఆశయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా సాధిస్తాం

అమలాపురం: మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు,అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొని ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ బాలయోగి పాల్గొని మాట్లాడుతూ మా నాన్న బాలయోగి,పద్మనాభం ఒకే సమయంలో నాన్న గారు స్పీకర్ గా,పద్మనాభం ఎంపీ గా పని చేసిన సందర్భాలు గుర్తు చేసుకుని,పద్మనాభం ఎక్కడున్నా నా ఎదుగుదల ను ఆకాంక్షించేవారని, అటువంటి గొప్ప నేతను కోల్పోవడం చాలా దురదృష్టకరమని,ఆయన ఆశయాలను పోరాట సమితి,కాపు నాయకులు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.

వైసీపీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆయన తండ్రికి,పద్మనాభం ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.ఇటువంటి నాయకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం అన్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి పాల్గొని మాట్లాడుతూ ఆయన ఇంటికి వెళ్తే ముందు కడుపు నింపి,ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి,జాతి కోసం పోరాడే వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం అన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ చిన్ననాటి లోనే ఎమ్మెల్యే గా గెలుపొంది తన జీవితాన్ని అంతా ప్రజా ప్రస్థానం లోనే ఉద్యమాలతోనే అలుపెరగ కుండా పోరాడిన వ్యక్తి అని అన్నారు.వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మరణించినప్పటికీ,ఆయన జీవించి ఉన్నట్లు గానే భావించి ఆయన ఆశయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ముందుకు తీసుకువెళ్లి, సాధించి తీరుతామని అన్నారు.

కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్ కుమార్, ఆకుల రామకృష్ణ,వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, జీ ఎల్ నరసింహారావు,చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యమంలో పద్మనాభం చూపించిన ప్రేమాభిమానాలు,కాపు ఉద్యమం లో పని చేసిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు.ఎమ్మెల్సీ లు కుడుపూడి సూర్యనారాయణ,బొమ్మి ఇజ్రాయిల్,ఆముడా చైర్మన్ అల్లాడ సోంబాబు,ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ,మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్,పాముల రాజేశ్వరి దేవి, ముమ్మిడివరం వైసీపీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీను,మెట్ల రమణ బాబు, గంధం పల్లంరాజు,అయితాబత్తుల సుభాషిణి, అయినవిల్లి మాజీ జడ్పీటీసీ గంగుమల్ల కాశీ అన్నపూర్ణా శ్రీనివాస్, ఏడిద శ్రీను,నల్లా శ్రీధర్,నల్లా అజయ్, నల్లా సంజయ్ తదితరులు పద్మనాభం గారి ఉద్యమ స్పూర్తి గురించి,ఆయన రాజకీయ స్పూర్తి గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సూదా గణపతి,నల్లా రామకృష్ణ,దంగుడు బియ్యం శ్రీనివాస్, అరిగెల నాని,తులా గోపాలకృష్ణ,చీకట్ల కిషోర్,కొల్లాటి దుర్గాబాయి,ఆకుల సూర్యనారాయణ మూర్తి,లయన్స్ క్లబ్ రవణం వేణు,అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, నల్లా స్వామి,నల్లా మల్లిబాబు,గోకరకొండ గంగన్న స్వామి, కంకిపాటి వెంకటేశ్వర రావు,బండి శ్రీను, గనిశెట్టి వెంకటేశ్వరరావు,జంగా రాజేంద్ర కుమార్,కర్రి బాబురావు,నల్లా పెదకాపు, కొమ్ముల రాము,కురసా ఆంజనేయులు, కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు,దున్నాల దుర్గ,నల్లా రామకృష్ణ,పోలిశెట్టి కన్నా,కల్వకొలను ఉమా,బెజవాడ సత్తిబాబు పలువురు నాయకులు, ముద్రగడ అభిమానులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story