Annamayya: 49 ఎకరాల దేవదాయ భూముల ఆక్రమణ.. కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు
Annamayya: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం ముష్టూరు గ్రామంలోని 49 ఎకరాల దేవదాయ భూముల ఆక్రమణపై బాధితులు మదనపల్లె జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
Annamayya: 49 ఎకరాల దేవదాయ భూముల ఆక్రమణ.. కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు
అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం ముష్టూరు గ్రామంలో దేవదాయ శాఖకు చెందిన సుమారు 49 ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపిస్తూ బాధితులు సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దామోదర్, లక్ష్మీనారాయణ, రెడ్డి మోహన్, రామ, శంకర్ మాట్లాడుతూ దేవదాయ శాఖకు చెందిన విలువైన భూములను కొందరు భూస్వాములు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం ఈ భూముల విలువ కోట్ల రూపాయలు ఉంటుందని, దేవాలయాలకు రావాల్సిన ఆదాయం కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ముష్టూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 585, 615, 542/5, 542/2, 675, 731, 866/బి, 868/2, 1041, 866-ఎ2, 869/1, 184, 361 తదితర భూములు పాలేటమ్మ దేవస్థానం, నేల మల్లేశ్వరస్వామి ఆలయం, సోమేశ్వరస్వామి ఆలయాలకు సంబంధించిన దేవదాయ భూములని తెలిపారు. ఈ భూముల ఆక్రమణ విషయాన్ని గతంలోనే దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వెంటనే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించి దేవదాయ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే దేవాలయ ఆస్తులను పరిరక్షించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




