Mydukur: మైదుకూరులో 10 నెలలుగా నిలిచిన ప్రమోషన్లు..

Mydukur: విద్యుత్ నౌకరుల పిఆర్సి, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణపై బద్వేల్‌లో విద్యుత్ శాఖ ముఖ్యనేతల సమరశంఖం.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 29 May 2026 1:36 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో 10 నెలలుగా నిలిచిన ప్రమోషన్లు..

మైదుకూరు: విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కార్మికలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిఆర్ సి ప్రకటించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నాయబ్ రసూల్, కె.నాగ మల్లయ్య,యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి.ప్రసాద్, ఎం.నాగరాజు,యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

శుక్రవారం బద్వేల్ లోని స్థానిక ఎన్జీవో హోం నందు విద్యుత్ శాఖ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయకపోవడం అన్యాయమని వారు తెలిపారు. అలాగే పిఆర్ సి ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు.విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లు(కరువు భత్యం)వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.46 వేలు రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

పెండింగ్ లోని ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికుల చేత వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని వారు తెలిపారు. ప్రమాదవశాత్తు కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదం జరిగితే అన్లిమిటెడ్ మెడికల్ సౌకర్యం కల్పించాలని వారు తెలియజేశారు.పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు తెలియజేశారు. బద్వేల్ సబ్ విఆర్ఓ నందు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయాలని వారు తెలిపారు.

జూనియర్ లైన్మెన్ లకు అసిస్టెంట్ లైన్మెన్లుగా ప్రమోషన్లు కల్పించాలని వారు చెప్పారు. బద్వేల్ సబ్ డివిజన్ నందుగల సబ్ స్టేషన్ లో వర్షాకాలము వర్షపు నీరు వచ్చి చేరుతున్నది దీనిపైన సివిల్ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు తెలిపారు. బద్వేల్ సబ్ డివిజన్ ఆవరణంలో ఖాళీ స్థలం నందు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయవలసిందిగా వారు తెలియజేశారు.

మైదుకూరు డివిజన్ నందు గత 10 నెలల నుంచి ప్రమోషన్లు కల్పించలేదు కార్మికులకు ఆర్థికంగా అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 2 వ తేదీన విజయవాడలోని యంబికె భవన్ లో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహిస్తున్నారని

ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లాలోని కార్మిక,ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు చిన్ని కృష్ణ,సుబ్బారావు, బత్తిన శ్రీనివాసులు, అబ్దుల్ వల్లి ,ప్రశాంత్, పిసి కొండయ్య ,నరసింహులు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story