Mydukur: వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి - డీఎస్పీ

Mydukur: మైదుకూరులో వినాయక ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, మండపాలకు అనుమతులు తప్పనిసరి అని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 Sept 2026 11:22 PM IST
Mydukur
X

Mydukur: వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి - డీఎస్పీ

మైదుకూరు: వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిని మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన శాంతి కమిటీతో సమావేశమయ్యారు.

వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించుకోవాలన్నారు. డీజే లకు అనుమతి లేదని,లౌడ్ స్పీకర్లకు పోలీసుల అనుమతి కోసం వినతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తగు జాగ్రత్తతో తీసుకోవాలన్నారు.నిమజ్జనం రోజున ఎలాంటి ఘర్షలకు తావివ్వకుండా ప్రశాంతంగా పండగ వాతావరణం జరుపుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రమణారెడ్డి ,ఆయా శాఖ అధికారులతో పాటుప అంజుమన్ కమిటీ ప్రతినిధులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story