Mydukur: దువ్వూరు పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా శెట్టి సావిత్రి

Mydukur: మైదుకూరు సమీప దువ్వూరు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం; సర్పంచ్‌గా శెట్టి సావిత్రి, ఉప సర్పంచ్‌గా అర్ధాకుల భరత్, 14 వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాల అందజేత.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 27 Nov 2026 6:23 PM IST
Mydukur
X

Mydukur: దువ్వూరు పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా శెట్టి సావిత్రి

​మైదుకూరు: దువ్వూరు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిశాయి. గ్రామ సర్పంచ్‌గా శెట్టి సావిత్రి, ఉప సర్పంచ్‌గా అర్ధాకుల భరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు పంచాయతీ పరిధిలోని మొత్తం 14 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

​ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు 14 మంది వార్డు సభ్యులకు అధికారిక ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR