Mydukur: మార్థోమ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

Mydukur: మైదుకూరు సి. బయనపల్లె మార్థోమ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 3 Sept 2026 10:01 PM IST
Mydukur
X

Mydukur: మార్థోమ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

మైదుకూరు: జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సి. బయనపల్లె గ్రామంలో గల జ్ఞాన జ్యోతి మార్థోమ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆప్తాల్మిక్ ఆఫీసర్ చంద్రమౌళి మాట్లాడుతూ, 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల్లో దృష్టి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడం ద్వారా వారు చదువులో వెనుకబడకుండా చూడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి కంటి పరీక్ష చేయించుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం అరుణ జ్యోతి, ఆశా కార్యకర్తలు శాంతమ్మ, గంగాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story