Mydukur: మైదుకూరులో పామాయిల్ సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ

Mydukur: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నంద్యాలంపేట రైతు సేవా కేంద్రంలో ఉద్యాన శాఖ, సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 July 2026 1:52 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో పామాయిల్ సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ

Mydukur: రైతులు పామాయిల్ సాగు పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చు అని మైదుకూరు ఉద్యాన అధికారి సి. రామకృష్ణ అన్నారు. బుధవారం మైదుకూరు మండలం నంద్యాలం పేట రైతు సేవా కేంద్రంలో ఉద్యాన శాఖ, సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సంయుక్త ఆధ్వర్యంలో పామాయిల్ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి C. రామకృష్ణ మాట్లాడుతూ ఎకరాకు 50 మొక్కలు చొప్పున నాటుకోవాలని మరియు రైతులకు ఉచితంగా మొక్కలు సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సరఫరా చేస్తారని, అలాగే మొక్కల నిర్వహణకు మరియు ఆంతర పంటల సాగు చేసుకునేందుకు హెక్టారుకు 10500 రూపాయలు నాలుగు సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

జాతీయ వెదురు మిషన్ కింద పెట్టారుకు 400 మొక్కలు చొప్పున వెదురు నాటుకున్నట్లయితే మొదటి సంవత్సరం 36,000 రెండవ సంవత్సరం 24,000 రూపాయల రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ జిఎం కొండారెడ్డి గారు మాట్లాడుతూ సంవత్సరం పొడుగునా రెండు ఇంచుల నీరు ఉన్నట్లయితే పామ్ ఆయిల్ పంటను ఐదు ఎకరాలలో నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని, మొక్కలను 9 మీటర్ల దూరంలో నాటుకోవాలని తెలియజేశారు.

నాటుకున్న మూడు సంవత్సరాల తరువాత పంట దిగుబడి రావడం ప్రారంభమవుతుందని, ఎకరానికి నాలుగవ సంవత్సరంలో నాలుగు టన్నుల దిగుబడి వరకు వస్తుందని వయసు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుందని, ఏడో సంవత్సరము వచ్చేసరికి 8 - 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలియజేశారు.

అలాగే పామాయిల్ పంట సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు ప్రస్తుతం పామాయిల్ ధర టన్నుకు 23,770 రూపాయలు ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన రైతు సేవా కేంద్ర అధికారి మధుసూదన్ రెడ్డి నంద్యాలంపేట రైతులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story