Mydukur: దళిత యువకుల మృతి కేసు ఐపీఎస్ అధికారితో సమగ్ర దర్యాప్తు

Mydukur: బ్రహ్మంగారిమఠం దళిత యువకుల మృతి కేసు విచారణను కడప ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్‌కు అప్పగించినట్లు మైదుకూరు డీఎస్పీ తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 28 Jun 2026 7:31 PM IST
Mydukur
X

Mydukur: దళిత యువకుల మృతి కేసు ఐపీఎస్ అధికారితో సమగ్ర దర్యాప్తు

మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు లో కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం.

బ్రహ్మంగారిమఠం దళిత యువకుల మృతిపై మైదుకూరు డిఎస్పి మీడియా సమావేశం. ఫిబ్రవరి నెల 5వ తారీఖు ఇద్దరు యువకులు కాలువలో పడి మృతి చెందడం జరిగింది. ఈ విషయంలో దళిత సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేశాయి.

యువకుల మృతి పై న్యాయం జరగలేదనీ దళిత సంఘాల ఆధ్వర్యంలో చలో కడప కార్యక్రమం చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. దళిత సంఘాలు మృతి పై పలు డిమాండ్లు వ్యక్తం చేశారు. డిమాండ్లలో భాగంగా ఈ కేసును ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని కోరారు.

వారి విజ్ఞప్తి మీదకు కడప ఎస్పీ నచికేత్ విశ్వనాత్ గారు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ గారిని విచారణ అధికారిగా నియమించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఎస్సై చట్టపరంగా చేయలేదన్న అనుమానం వ్యక్తం చేశారు.

బ్రహ్మంగారిమఠం ఎస్ఐ మీద కేసు కు సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు డిఎస్పీ మైదుకూరు వారికీ మేము జారీ చేయడం జరిగింది దానిపై విచారణ జరిపి నివేదిక పంపాలి అని ఎస్పీ గారు కోరడం జరిగింది. మృతులతో సహా వెళ్లిన సాక్షి వీడియోను FSL పంపడం జరిగింది.

దాని త్వరితగతిన వచ్చేలా స్పెషల్ మెసెంజర్ ను ఏర్పాటు చేసి తెప్పించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మరియు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి దళిత సంఘాలు అనుబంధ సంఘాలను కోరడం జరిగింది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story