Kadapa: నాదనాగేశ్వర స్వామి పాలకవర్గానికి ఎమ్మెల్యే పుట్టా సూచన!
Kadapa: ఖాజీపేట నాదనాగేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్‌గా గంగవరం సూర్య సుమన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరయ్యారు.
Kadapa: నాదనాగేశ్వర స్వామి పాలకవర్గానికి ఎమ్మెల్యే పుట్టా సూచన!
కడప జిల్లా: ఖాజీపేట మండలం నాదనాగేశ్వర్ స్వామి దేవస్థానం నూతన చైర్మన్‌గా శ్రీ గంగవరం సూర్య సుమన్ రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం నిర్వహించిన చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, నూతన చైర్మన్ శ్రీ గంగవరం సూర్య సుమన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, దేవస్థానం అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నాదనాగేశ్వర్ స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేవస్థానం పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ పరిసరాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ దేవస్థానం ప్రతిష్టను మరింత పెంచాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. భక్తుల సేవే పరమావధిగా భావించి, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
నూతన చైర్మన్ శ్రీ గంగవరం సూర్య సుమన్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆశీస్సులు, సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులు, పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




