Mydukur: మైదుకూరులో అధికారుల కుమ్మక్కుపై విచారణకు డిమాండ్
Mydukur: మైదుకూరు మున్సిపల్ ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో నాణ్యత లేని రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని రైతు సేవా సమితి నేత ఏవి. రమణ ఆరోపించారు.
Mydukur: మైదుకూరులో అధికారుల కుమ్మక్కుపై విచారణకు డిమాండ్
Mydukur: మైదుకూరు మున్సిపల్ ఇంజనీర్ , కాంట్రాక్టర్లు కుమ్మక్కతో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్లు ,డ్రైనేజీ పనులు నాణ్యత లేకుండా చేస్తుండడంతో ప్రజలకు సౌకర్య వంతమైన మౌలిక వసతులు కల్పించడం లేదని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మైదుకూరు పట్టణం ఎనిమిదవ డివిజన్ కడప రోడ్డు శారద విద్యా మందిర్ స్కూల్ ఎడమ పక్కవీధిలో ఆరు నెలల క్రితం రోడ్డు, డ్రైనేజీ కాలువ పనులు నాణ్యత లేకుండా,
డ్రైనేజీ కాలువ ఎత్తుపల్లాలు లేకుండా చేయడంతో డ్రైనేజీ మురికినీరు రోడ్డుపైన కాలవలోనే నిల్వ ఉండడంతో వీధి ప్రజలు రైతు సేవా సమితి నాయకత్వానికి తెలియజేయడంతో ఈరోజు రైతు సేవాసమితి మైదుకూరు పట్టణ నాయకత్వం ఆధ్వర్యంలో సమస్యను పరిశీలించడం జరిగిందని పనులు జరుగుతున్న ప్రాంతంలో మున్సిపల్ ఇంజనీర్ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేకుండా పనులు జరుగుతుండడంతో పనులు చేసి కూడా ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు కలగడం లేదని మైదుకూరులో జరుగుతున్న,
జరిగిన ఈ రోడ్లు, డ్రైనేజీ వర్కుల పైన కడప జిల్లా కలెక్టర్ గారు మైదుకూరు పట్టణంలో జరిగిన అవినీతిపనులపైన విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని పట్టణప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు కల్పించాలని ఏవి. రమణకడప జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు పట్టణ అధ్యక్షుడు కాన గూడూరు రామ్మోహన్, సమితి సభ్యులు మూలే సుబ్బారెడ్డి,సైమన్, మాల కొండయ్య, వీధి ప్రజలు పోలూరు హరి, నాగరత్నం, సుబ్బమ్మ, నాగేశ్వరితదితరులు పాల్గొన్నారు.




