Mydukur: మైదుకూరులో ఇకపై మున్సిపల్ పన్నుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే

Mydukur: మైదుకూరు పురపాలక సంఘం పరిధిలో ఇకపై ఆస్తి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తామని కమిషనర్ వై. రంగస్వామి తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Nov 2026 3:11 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో ఇకపై మున్సిపల్ పన్నుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే

మైదుకూరు: మైదుకూరు పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ పన్నుల చెల్లింపులను ఇకపై ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ వై. రంగస్వామి తెలిపారు.

మున్సిపల్ పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులతో పాటు స్వర్ణ వార్డుల పరిధిలోనూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రజలు ఆస్తిపన్ను, నీటిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులతో పాటు ఇతర మున్సిపల్ ఫీజులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. పన్నుల చెల్లింపుల్లో డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారదర్శకతకు తోడ్పడటంతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.

మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరూ ఈ నూతన విధానాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వై. రంగస్వామి కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR