Mydukur: ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన.. రైతుల దశాబ్దాల కల సాకారం!

Mydukur: ₹8.90 కోట్లతో తిప్పిరెడ్డిపల్లె - ముదిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం పనులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి శంకుస్థాపన చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 29 July 2026 4:56 PM IST
Mydukur
X

Mydukur: ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన.. రైతుల దశాబ్దాల కల సాకారం!

మైదుకూరు: మైదుకూరు నియోజకవర్గ రైతుల దశాబ్దాల కల నేడు సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె గ్రామాల రైతులకు శాశ్వత పరిష్కారం చూపే ₹8 కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం పనులకు నేడు ఘనంగా శంకుస్థాపన జరిగింది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, కడప జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి, ఐఏఎస్ గారు పాల్గొని పూజా కార్యక్రమాల అనంతరం శంకుస్థాపన చేసి పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా JCB యంత్రంపైకి ఎక్కి పనులను ప్రారంభించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోందనే సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది.

ఈ ఎత్తిపోతల పథకం పూర్తయిన అనంతరం తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె చెరువులు సమృద్ధిగా నీటితో నిండి, వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. దీని ద్వారా పంటల ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగి, ఈ ప్రాంత వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.

ఈ సందర్భంగా గ్రామాల రైతులు, ప్రజలు భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ... "దశాబ్దాలుగా మా గ్రామాల రైతులు ఎదురుచూసిన కలను నేడు నిజం చేసిన మా ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. మా సమస్యను అర్థం చేసుకుని ఇంత పెద్ద ప్రాజెక్టును మంజూరు చేసి పనులు ప్రారంభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే ఈ ప్రాజెక్టు రూపకల్పన, అనుమతులు, అమలులో సహకరించిన జలవనరుల శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది... గ్రామం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story