Mydukur: వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో పౌష్టికహార భోజన వితరణ
Mydukur: మైదుకూరు మండలం వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమంలో భాగంగా సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికహార భోజనం పంపిణీ చేశారు.
Mydukur: వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో పౌష్టికహార భోజన వితరణ
మైదుకూరు: మైదుకూరు మండలం వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రి(PHC)లో ప్రదాన మంత్రి మాతృత్వ అభియాన్(PMSMA)కార్యక్రమాన్ని నిర్వహించారు ' TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి తమ్మిశెట్టి సుభద్రమ్మ*స్థానిక టీడీపీ నాయకులు శ్రీ తమ్మిశెట్టి *సుబ్బారాయుడు దంపతుల సహకారంతో రెండో సారి ఈ నెలలో కూడా గర్భవతులకు రోగులకు సుమారు 200 మందికి పౌష్టికహార భోజనంను అందించారు.
కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు స్థానిక టీడీపీ నాయకులు ఇస్మాయిల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కటారు వీరన్న మరియు స్థానిక గ్రామ యువకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తమ్మిశెట్టి సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇక మాతృత్వ అభియాన్ కార్యక్రమంను ప్రతి నెల నిర్వహిస్తానని తెలిపారు. TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అభినందనీయం మానవీయమని నేటి యువతకు స్ఫూర్తి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రజలు కొనియాడారు.




