Mydukur: మైదుకూరులో బాలసిద్ధారెడ్డి హత్య కేసు ఛేదన - ముగ్గురు అరెస్ట్
Mydukur: వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం గడ్డమాయపల్లెలో బాలసిద్ధారెడ్డి హత్య కేసును చేధించిన పోలీసులు. ప్రధాన నిందితుడు సహా ముగ్గురి అరెస్ట్.
Mydukur: మైదుకూరులో బాలసిద్ధారెడ్డి హత్య కేసు ఛేదన - ముగ్గురు అరెస్ట్
మైదుకూరు: వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం గడ్డ మాయ పల్లె గ్రామంలో ఈనెల 5వ తేదీన జరిగిన హత్యా కేసును మైదుకూరు పోలీసులు చేదించారు.
గడ్డ మాయ పల్లె లోని షేక్ అబ్దుల్ రసూల్ పొలం లో ఉన్న బోరు పక్కనే బాల సిద్ధారెడ్డి బోరు వేస్తూ ఉండగా మొదలైన గొడవలో పథకం ప్రకారం ఇంటి నుండి తెచ్చిన వేట కొడవలి తో షేక్ అబ్దుల్ రసూల్ బాల సిద్ధారెడ్డి మెడపై దాడి చేయడంతో ఘటన స్థలంలోనే బాల సిద్ధారెడ్డి చనిపోయాడని డిఎస్పి రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలిపారు.
బాల సిద్ధారెడ్డిని హత్య చేసిన షేక్ అబ్దుల్ రసూల్ ను, అతనికి సహకరించిన షేక్ చాంద్ పీర్, శ్రీరాముల వెంకటయ్య లను ఈరోజు ఉదయం అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ మీడియా కు తెలిపారు.
హత్యకు ఉపయోగించిన వేట కొడవలిని రెండు బైక్లను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో ముద్దాయిలను పట్టుకున్న ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి మరియు సిబ్బందిని డిఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.




