Mydukur: పాలిటెక్నిక్ కళాశాలలో 5న స్పాట్ అడ్మిషన్లు!
Mydukur: మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈనెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.పార్ధసారథి తెలిపారు.
Mydukur: పాలిటెక్నిక్ కళాశాలలో 5న స్పాట్ అడ్మిషన్లు!
Mydukur: మైదుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్టు కళా శాల ప్రిన్సిపాల్ జి.పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొద్ది కళాశాలలో మాత్రమే ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సులు మైదుకూరు కాలేజీలో అందుబాటులో ఉండటం ప్రత్యే కమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఏపీ పాలిసెట్ -2026లో అర్హత పొందిన ఓసీ, బీసీ విద్యార్థులకు మొత్తం ప్రవేశ రుసుం రూ.5,400, అర్హత పొందని లేదా పాలిసెట్ రాయని విద్యార్థులకు రూ.5,800, పాలిసెట్లో అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లకు రూ.4,950, అర్హత పొందని లేదా పాలిసెట్ రాయని విద్యార్థులకు రూ.5,050 ఉంటుందని వివరించారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ టీసీ, పదో తరగతి మార్కుల జాబితా, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, అలాగే పాలిసెట్ అర్హత పొందిన వారు హాల్ టికెట్, ర్యాంక్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
కాలేజీలో ఈనెల 5న జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాలకు 7075922670, 8985257287 నంబర్లలో సంప్రదించాలని కోరారు.




