Mydukur: మైదుకూరు సహకార సంఘం ఎన్నికలపై సభ్యులకు అవగాహన సదస్సు!
Mydukur: మైదుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు కోసం సభ్యులంతా ఇ-కెవైసి చేయించుకోవాలని సూచించారు.
Mydukur: మైదుకూరు సహకార సంఘం ఎన్నికలపై సభ్యులకు అవగాహన సదస్సు!
మైదుకూరు: మైదుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శుక్రవారం సొసైటీ అధ్యక్షులు పాశంమారుతీ ఆధ్వర్యంలో సహకార సంఘం ఎన్నికలపై సిఈఒ సహకార సంఘం సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘం బలంగా ఉంటే రైతులకు మెరుగైన సేవలు అందు తాయన్నారు.
సొసైటీలో 2013 నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగ లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తమ ఓటుని ఇకెవైసి చేయించుకోవాలన్నారు.
ఇకెవైసి చేయించుకోని సభ్యులు తమ ఓటు హక్కు కోల్పోతారన్నారు. సం ఘంలో కొత్తగా సభ్యులుగా చేరేందుకు 18ఏళ్లు వయస్సు నిండిన వారు అర్హులన్నారు. సభ్యత్వం కోసం దరఖాస్తు, ఆధార్, ఫొటోలు, భూమి/కౌలు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. సభ్యత్వం కలిగిన మండలంలోని ప్రతి రైతు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ లు బయన బోయిన నరసింహులు , పోలు చిన్న కొండారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.




