Mydukur: జీవో 396ను వెంటనే రద్దు చేయాలి రైతు సేవా సమితి

Mydukur: మైదుకూరులో దస్తావేజు లేఖరుల నిరసనకు రైతు సేవా సమితి మద్దతు. జీవో 396 రద్దు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఏవి రమణ డిమాండ్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 23 July 2026 3:33 PM IST
Mydukur
X

Mydukur: జీవో 396ను వెంటనే రద్దు చేయాలి రైతు సేవా సమితి

మైదుకూరు: మైదుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలని దస్తావేజులేఖరులు, స్టాంపువెండర్లు, డిటిసి ఆపరేటర్లు చేస్తున్న నిరసనకు మద్దతుగా రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ, సమితి మైదుకూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, రామ్మోహన్, శ్రీనివాసులతో కలిసి ఈరోజువెళ్లి సంపూర్ణ మద్దతు తెలియజేసిన ఏవి.రమణ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం పి పి పి విధానంతో జీవో నెంబర్ 396 తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర దస్తావేజులేఖర్లుగా, స్టాంపు వెం డర్లుగా, డిటిసి ఆపరేటర్లుగాఉపాధి పొందుతున్న నిరుద్యోగ యువకుల పొట్టకొట్టేందుకు తీసుకొచ్చిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని రమణకోరారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను, కార్యాలయాలను ప్రైవేటు వారికి అప్ప చెప్పే ప్రయత్నాన్ని , విద్య ,వైద్య విధానాలు ప్రైవేటుపరం, ఆర్టీసీని హైయర్ బస్సులతో ప్రైవేటు పరం చేసే ప్రయత్నం, కోట్ల రూపాయలప్రభుత్వ ఆస్తులను కేవలం శంకుస్థాపనలతో పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పే విధానం వెంటనే మానుకోవాలని ,ప్రజలందరి ఆహారం కోసం రాత్రి నకా, పగలనక పంటలు పండించిశ్రమిస్తున్న రైతు పొలాలకు సాగునీటి కోసం జిల్లాలో ,రాయలసీమలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రమణ కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story