Mydukur: చెక్క భజన మహిళా కళాకారులకు టీఎస్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

Mydukur: మైదుకూరు వనిపెంటలో చెక్క భజన కొనసాగిస్తున్న ఇద్దరు మహిళా కళాకారులకు రూ.10,000 ఆర్థిక ప్రోత్సాహం అందించిన TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 23 Nov 2026 8:31 PM IST
Mydukur
X

Mydukur: చెక్క భజన మహిళా కళాకారులకు టీఎస్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

​మైదుకూరు: గ్రామీణ సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, కళాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరో ముందడుగు వేసింది. వనిపెంట గ్రామంలో అరుదైన సంప్రదాయ కళ అయిన 'చెక్క భజన'ను కొనసాగిస్తూ, తమ ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఇద్దరు మహిళా కళాకారులకు ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక ప్రోత్సాహక సహాయాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. "మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న జానపద, సంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ముఖ్యంగా మహిళా కళాకారులను ఆర్థికంగా ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం పెంపొందుతుంది. తద్వారా ఈ కళలు అంతరించిపోకుండా భావితరాలకు అందించవచ్చు" అని పేర్కొన్నారు.

​సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాలకు మరియు గ్రామీణ కళాకారులకు అండగా నిలవడమే TSR సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. స్థానిక మహిళా కళాకారులకు ఆర్థిక చేయూత అందించిన ట్రస్ట్ సేవలను వనిపెంట గ్రామస్తులు, కళాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR