Mydukuru: మైదుకూరులో శ్రీ అవధూత కొండయ్య స్వామిని దర్శించుకున్న విదేశీయులు!

Mydukuru: మైదుకూరు ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామిని దర్శించుకున్న విదేశీ ప్రతినిధులు. అమెరికా, యూరప్, న్యూజిలాండ్ ప్రతినిధుల ప్రత్యేక పూజలు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 10 Nov 2026 11:28 AM IST
Mydukuru
X

Mydukuru: మైదుకూరులో శ్రీ అవధూత కొండయ్య స్వామిని దర్శించుకున్న విదేశీయులు!

Mydukuru: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీ అవధూత కొండయ్య స్వామిని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం దర్శించుకున్నారు. యూరప్, అమెరికా, న్యూజిలాండ్ సహా దాదాపు పది దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్వామివారి ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి అనుగ్రహం, ఆశ్రమ వాతావరణం తమకు ఎంతగానో ప్రశాంతతను చేకూర్చాయని ప్రతినిధులు పేర్కొన్నారు. విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR