Mydukuru: దువ్వూరులో 'కూటమి ప్రభుత్వం' ప్రచారం టిడిపి నేతలు

Mydukuru: మైదుకూరు దువ్వూరు టౌన్ 22వ వార్డులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై టిడిపి ప్రచారం. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు వివరించిన నాయకులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Aug 2026 4:16 AM IST
Mydukuru
X

Mydukuru: దువ్వూరులో 'కూటమి ప్రభుత్వం' ప్రచారం టిడిపి నేతలు

మైదుకూరు: టౌన్ ఇంచార్జ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం కారం లోకి వచ్చిన తొలి నెలలోనే సామాజిక పింఛన్ ను 3000 రూపాయల నుంచి 4000 వేల రూపాయలకు పెంచి ఎన్నికల హామీని నిలబెట్టుకుందని,"తల్లికి వందనం" పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని,ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు.

అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని,స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని,నిరుపేదలైన ఆటో వాళ్లకు ఆటోడ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ఇంచార్జ్ పాపినేని రాంబాబు, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్ కోనేటి హరినాథ్,మార్కెట్ యార్డు డైరెక్టర్ ఆశీర్వాదం, శేట్టి నాగరాజు యాదవ్, బందేకాన్, మైనార్టీ నాయకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story