Duvvuru: దువ్వూరులో కలకలం రేపిన అనుమానాస్పద ముగ్గుఆందోళనలో స్థానికులు!
Duvvuru: దువ్వూరు మండల కేంద్రంలోని ఇందిరానగర్ బజార్‌లో వేసిన అనుమానాస్పద ముగ్గు స్థానికంగా కలకలం రేపింది. క్షుద్రపూజలని ఆందోళన చెందుతున్నారు.
Duvvuru: దువ్వూరులో కలకలం రేపిన అనుమానాస్పద ముగ్గుఆందోళనలో స్థానికులు!
Duvvuru: మండల కేంద్రమైన దువ్వూరు గ్రామంలోని ఇందిరానగర్ బజార్ వీధి మోట్లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన అనుమానాస్పద ముగ్గు స్థానికంగా కలకలం రేపింది. చేతబడి లేదా క్షుద్రపూజల ఆనవాళ్లను పోలి ఉన్న ఈ వింత ముగ్గును గమనించిన కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ వీధి గుండా స్థానిక పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఆ దారి గుండా వెళ్లకుండా, ఆ ముగ్గును తొక్కకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పెద్దలు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మూఢనమ్మకాల పట్ల ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు గురికావద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సదరు ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
రాత్రి వేళల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సంబంధిత అధికారులు తగిన విచారణ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




