Kadapa: కడపలో నారా లోకేష్ సంచలన పర్యటన.. రూ.3 వేల కోట్ల ప్లాంట్ ఓపెనింగ్!
Kadapa: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటన.
Kadapa: కడపలో నారా లోకేష్ సంచలన పర్యటన.. రూ.3 వేల కోట్ల ప్లాంట్ ఓపెనింగ్!
Kadapa: 22 -05-26 రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జిల్లా పర్యటన వివరాలు
ఉ.10.15 నుండి ఉ.11 గం.ల వరకు పెనికలపాడు గ్రామం ముద్దనూరు మండలం లో రైతులతో ముఖాముఖి
అనంతరం మ.12.15 నుండి మ.1.45 వరకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్
కడప జిల్లాలో ఎస్ఏఈఎల్(SAEL) సోలార్ ప్లాంట్ల నిర్మాణం
600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించిన ఎస్ఏఈఎల్
రూ.3వేల కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాల కల్పన
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్ఏఈఎల్ (SUSTAINABLE AND AFFORDABLE ENERGY FOR LIFE) సోలార్ పవర్ కంపెనీ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా రెండు ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించింది. కొండాపురం, పెద్దముడియం మండలాల్లో రెండు సోలార్ ప్లాంట్లను 300 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం పూర్తిచేసింది. కొండాపురం మండలం టి.కోడూరు వద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. పెద్దముడియంలోని మరో ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
రూ.3వేల కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాల కల్పన
ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ రూ.3వేల కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించడం జరిగింది. తద్వారా 500 మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి జరగనుంది. మొత్తం 600 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పునరుత్పాదక శక్తి రంగంలో అత్యంత వ్యూహాత్మక పెట్టుబడులలో ఒకటిగా నిలిచాయి. 2,400 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ ప్రాజెక్టులో 12 లక్షలకు పైగా అత్యాధునిక టాప్ కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ను వినియోగించడం జరిగింది. ఈ సౌర ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 11 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించే అవకాశం ఉంది. నిర్మాణ దశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మంది కార్మికులు పనిచేశారు. ప్రజాప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో భూవినియోగం, అనుమతులు, గ్రిడ్ కనెక్షన్ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో రెండు ప్రాజెక్టులను 11 నెలల్లోనే ఎస్ఏఈఎల్ నిర్మించింది. భవిష్యత్ లో రూ.10 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది.




