Kashinayana: నరసాపురం-ఓబులాపురం రహదారికి ఎట్టకేలకు మోక్షం ప్రారంభమైన మరమ్మతు పనులు!

Kashinayana: కాశినాయన నరసాపురం ఓబులాపురం రోడ్డు మరమ్మతు పనులు బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్ సూర్యనారాయణరెడ్డి చొరవతో ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

P Upendra, Kadapa Porumamilla
Published on: 15 Oct 2026 5:23 PM IST
Kashinayana
X

Kashinayana: నరసాపురం-ఓబులాపురం రహదారికి ఎట్టకేలకు మోక్షం ప్రారంభమైన మరమ్మతు పనులు!

Kashinayana: కాశినాయన మండలంలోని నరసాపురం నుంచి ఓబులాపురం వెళ్లే ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గుంతలమయంగా మారిన ఈ రహదారిపై ప్రయాణించేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మంజూరైన రహదారి మరమ్మతు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్ సూర్యనారాయణరెడ్డి చొరవ తీసుకోవడంతో కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి రహదారి మరమ్మతు పనులను ప్రారంభించారు.

మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో కాశినాయన మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla