Veeraballi: శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరం!

Veeraballi: ఎస్‌డికెఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం. క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి వ్యాఖ్య.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 11:00 PM IST
Veeraballi
X

Veeraballi: శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరం!

Veeraballi: విద్యార్ధులు, యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగా లంటే క్రీడలు ఎంతో దోహదపడతాయని విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి అన్నారు.శనివారం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కడప జిల్లా వీరబల్లి మండలం లో మై భారత్ కేంద్రం మరియు విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా స్థానిక ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.

మొదటగా భారతదేశ హకీ ప్రముఖ క్రీడాకారుడు మేజర్ ధ్యానచంద్ జయంతినే జాతీయ క్రీడాదినోత్సవంగా పరిగనిస్తారని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సురేంద్రారెడ్డి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ విజయాన్ని లక్ష్యంగా కాకుండా క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు.

ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు మరియు ప్రశంషాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఏ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెహవిల్ బాషా, కళాశాల డైరెక్టర్ రవిశేఖర్ రెడ్డి, కళాశాల సిబ్బంది,క్రీడాకారులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story