Rayachoty: రాయచోటి విద్యుత్ ఏడీ వరప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వక కలయిక!
Rayachoty: ఎలక్ట్రికల్ నూతన ఏడీగా బాధ్యతలు స్వీకరించిన వరప్రసాద్ రెడ్డి టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Rayachoty: రాయచోటి విద్యుత్ ఏడీ వరప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వక కలయిక!
రాయచోటి: రాయచోటి రూరల్ ఎలక్ట్రికల్ విభాగానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏడీ వరప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏడీ వరప్రసాద్ రెడ్డి గారిని డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాయచోటి రూరల్ పరిధిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడం, విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, విద్యుత్ శాఖ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆకాంక్షించారు.




